పేషంట్లు ఫిజియోథెరపీని వినియోగించుకొని ఆరోగ్యవంతులుగా ఉండాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు కావలసిన వైద్య సౌకర్యాలను దరి చేర్చాలని గొప్ప ఉద్దేశంతో వైద్య సౌకర్యాలను మెరుగుపరుస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు.సోమవారం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.జిల్లా వైద్యాధికారి డా. కె. మల్లికార్జున్ రావు గారితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని రోగులకు పండ్లు పంపిణీ చేశారు.