అతి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో వర్షాలకు పంట నష్టపోయిన రైతులు తమ వివరాలను అందజేయాలని చిన్నశంకరంపేట మండల వ్యవసాయ అధికారి లక్ష్మి ప్రవీణ్ సూచించారు. ఈ సందర్బంగా అయన మీడియాతో మాట్లాడుతు రైతులు తమ ఆధార్, పట్టా పాస్ బుక్ , బ్యాంక్ ఖాతా జిరాక్స్ లను రెండు రోజుల్లోగా వ్యవసాయ అధికారులకు సమర్పించాలని కోరారు. పంట మునిగిపోయిన రైతులు, ఇసుకమేటలు వేసిన పొలాల రైతులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. జిరాక్సులు వ్యవసాయ విస్తరణ అధికారులకు రెండు రోజుల్లో అందించాలని రైతులకు సూచించారు. వాటిని జిల్లా అధికారులకు పంపించడం జరుగుతుందని, ప్రభుత్వం పంట నష్టం ప్రకటించినప్పుడు వారికీ అందజేస్తామన్నారు.