నార్సింగి మండల కేంద్రంలో మెదక్ ఎంపీ మాధవనేని రఘు నందన్ రావు పర్యటించారు. గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల 44వ జాతీయ రహదారి పై భారీగా నీరు వచ్చి పూర్తిగా దెబ్బతిన్న రోడ్డును ఆయన పరిశీలించారు. వ్యవసాయ అధికారులను పంట నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు, అనంతరం రోడ్డు పరిశీలించి అధికారులకు ఫోన్ చేసి రోడ్డు మరమ్మాత్తు పనులు తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు, అనంతరం గన్నారువాగును పరిశీలించి పంటలు నష్టపోయిన రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లి పంట పొలాల్లో ఇసుక మేటలు వేషయాని అన్నారు