జిల్లాలో ఆదివాసి గిరిజనులకు ప్రభుత్వపరంగా అన్ని వసతులు కల్పించి ఉపాధి అవకాశాలను పెంచేందుకు ఆది కర్మయోగి అభియాన్ యోజన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు.మంగళవారం పట్టణంలోని టీఎన్జీవో కార్యాలయంలో మాస్టర్ ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు.జిల్లాలోని తొమ్మిది మండలాల్లో ఆది కర్మయోగి పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని ప్రభుత్వ పథకాలను అన్ని శాఖల సమావేశం తో అమలుచేయడం జరుగుతుంది అని వారు తెలిపారు.