విజయనగరంలో ఫ్రీ బస్ పధకంలో భాగంగా ఓ మహిళ తీవ్రస్థాయిలో హల్ చల్ చేసింది. విజయనగరం- విశాఖపట్నం వెళ్లే బస్సులో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ కాంప్లెక్స్ లో బస్సు ఎక్కేందుకు కర్చీప్ వేసింది. ఆమె లోపలికి ప్రవేశించగానే ఓ పురుషుడు సీట్లో కూర్చున్నాడు. ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు మహిళ వ్యక్తిని తీవ్ర స్థాయిలో ప్రశ్నించింది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో మహిళ ముందుగా సీట్లో కూర్చొని వ్యక్తిపై చేయి చేసుకుంది. సదరు వ్యక్తి కూడా ప్రతిఘటించి చెప్పులతో దాడి చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది