జర్నలిస్టుల చట్టాలను పునరుద్ధరించాలని కోరుతూ ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో కర్నూలు కలెక్టరేట్ ఎదుట మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకుడు మద్దిలేటి, సత్యనారాయణ గుప్తా మాట్లాడారు. జర్నలిస్టుల కోసం ఉన్న రక్షణ చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అవినీతిని ప్రశ్నిస్తూ వార్తలు రాస్తున్న జర్నలిస్టులపై దాడులు చేయడం బాధాకరమన్నారు.