అల్లూరి జిల్లా అందాల హారతిలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఆరుకు ఎమ్మెల్యే రేగం మత్యలింగం, ఆర్టీసీ డైరెక్టర్ సివెరి దొన్ను దొర పాల్గొన్నారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో పట్టణ పరిధిలో పలు ప్రాంతాల వద్ద స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్లాస్టిక్ నియంత్రణ దిశగా ప్రతి ఒక్కరు అడుగులు వేయాలని ప్లాస్టిక్ నియంత్రణ ప్రతి ఒక్కరు సహకరించాలని సూచించారు. ఆర్టీసీ డైరెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని అప్పుడే ఆనందదాయకమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని సాగిస్తామని సూచించారు.