రాజీవ్ స్వగృహ జలజ టౌన్ షిప్ లో ఫ్లాట్ కొరకు ఆసక్తి గల ఉద్యోగులు ఆగస్టు 30 లోపు 2 లక్షల రూపాయలు చెల్లించి పేరు రిజిస్టర్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, రాజీవ్ స్వగృహ సీఈ భాస్కర్ రెడ్డి లతో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజీవ్ స్వగృహ జలజ టౌన్ షిప్ పై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.