వంద రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా నేడు శుక్రవారం వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు తుంకుల్ గడ్డ లో పరిసరాల పరిశుభ్రత పై కాలనీవాసులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య మాట్లాడుతూ.. పరిసరాలు పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని పేర్కొన్నారు. ఇంటి పరిసరాలలో నీటి నిల్వలు ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీజన్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వ్యాధుల పట్ల కాలనీవాసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ దశరథం, కమ్యూనిటీ