ఆటోలు బబెల్ట్ షాపులకు తరలిస్తున్న మద్యాన్ని అడ్డుకున్న యువకులు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవి పేట మద్యం షాపు నుండి బెల్టు షాపులకు అక్రమంగా తరలిస్తున్న మధ్యాన్ని యువకులు నేడు ఆదివారం రోజున మధ్యాహ్నం రెండు గంటలకు అడ్డుకున్నారు. అనంతరం ఎక్సైజ్ అధికారులకు సమాచారాన్ని ఇచ్చినప్పటికీ పట్టించుకోలేదు. ఉన్నత అధికారులు స్పందించి అధికారులపై చర్యలు తీసుకోవాలని యువకులు డిమాండ్ చేస్తున్నారు.