Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 30, 2025
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి పాఠశాల ఆవరణలో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు విద్యార్థుల సౌకర్యార్థం రెండు నూతన స్కూల్ బస్సులను ప్రారంభించినట్లు జియం రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది రోజుల క్రితం విద్యార్థులకు ఇచ్చిన హామీ మేరకు నూతనంగా రెండు బస్సులను ప్రారంభించినట్లు,తద్వారా విద్యార్థులు త్వరగా పాఠశాలకు చేరుకొని చదువుకునే అవకాశం ఉంటుందని గత సంవత్సరం 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సింగరేణి పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఈ సంవత్సరం కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి 10వ తరగతిలో మంచి ఫలితాలు సాధించాలన్నారు జీఎం రాజేశ్వర్ రెడ్డి.