ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో ఓ ప్రభుత్వ డాక్టర్ ప్రజలకు అవగాహన కల్పించడానికి వినూత్న రీతిలో ప్రచారం చేశారు. గురువారం మండలంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు గురించి మైక్లో స్వయంగా ప్రచారం చేశారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఎవరికైనా అనారోగ్యం ఉంటే క్యాంపునకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ ఐయింది. డాక్టర్ చొరవపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.