రాజపూర్ మండలం గుండ్ల పొట్లపల్లి గ్రామ సమీపంలో ఉపాధి కూలీకి వెళ్లిన మల్లమ్మ( 43)అనే మహిళ చెరువులో కాళ్లు కడుక్కోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు జారిపడింది. దీంతో గమనించిన తోటి ఉపాధి కూలీలు ఆమెను హుటాహుటిన జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే మల్లమ్మ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మల్లమ్మ మృతి పట్ల సంబంధిత అధికారులు సంతాపం వ్యక్తం చేశారు.