నల్లగొండ జిల్లాలోని యూరియా కోసం రైతులు తెల్లవారుజాము నుంచి పలు ప్రాంతాలలో జిల్లా వ్యాప్తంగా పిఎసిఎస్ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. సరైన సమయంలో యూరియా వెయ్యకపోతే దిగుబడిపై ప్రభావం చూపుతుందని రైతులు మంగళవారం ఆందోళన చెందుతున్నారు. ఒక్కో రైతుకు ఒకటి లేదా రెండు బస్తాలు మాత్రమే ఇస్తుండడంతో కొందరికి అసలు దొరకక రైతులు నిరాశ చెందుతున్నారు దీనిపై ప్రభుత్వం స్పందించి యూరియాని వెంటనే సరఫరా చేయాలన్నారు.