అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలోని ఎస్ కొండాపురం గ్రామానికి చెందిన సకల వసుంధర అనే వివాహిత కడుపునొప్పి తాళలేక టాబ్లెట్లు మింగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లుగా నిర్ధారించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.