భవన నిర్మాణాలకు అవసరమైన ఇసుక, మట్టి, డెబ్రిస్ తదితర సామాగ్రి రవాణా సందర్భంలో లారీలు, ట్రిప్పర్లు, ట్రాక్టర్లు, ఎద్దుల బండ్ల నిర్వాహకులు తగిన జాగ్రత్త చర్యలు తీసుకొని రోడ్లపై వాటిని వెదజల్లకుండా తరలించాలని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా నగరవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో కమిషనర్ బుధవారం పర్యటించారు.