2022లో సోషల్ మీడియా వేదికగా హిందువులు, బ్రాహ్మణులపైన అనుచిత వ్యాఖ్యలు చేశానని మహాసేన రాజేశ్ తెలిపారు. ఆలోచిస్తే తన వ్యాఖ్యలు కరెక్ట్ కాదని కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రం వద్ద మంగళవారం ఉదయం 11 గంటలకు క్షమాపణ చెప్పానన్నారు. సమాజంలో అన్ని కులాలు, మతాలు కలిసి ఉండాలని అందరూ కలిసి ఉన్నప్పుడే అభివృద్ధి ఉంటుందన్నారు.