రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసినట్లు ఎంపీడీవో మహేందర్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని మండల పరిషత్తు కార్యాలయం తో పాటు అన్ని గ్రామాల పంచాయతీ కార్యాలయాల్లో శనివారం పబ్లిష్ చేసినట్లు తెలిపారు. ఓటర్ జాబితా పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 8వ తేదీ వరకు ఫిర్యాదులు చేయాలని, సమస్యలు పరిష్కరించి ఈ నెల 10న తుది జాబితా విడుదల చేస్తామని వెల్లడించారు.