ప్రకాశం జిల్లా మార్కాపురంలో వినాయక చవితి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణ ప్రజలు నివాసాలలో వినాయకుని ప్రతిమను ఏర్పాటు చేసుకొని ప్రత్యేక పూజలు చేశారు. పండగ రోజు వివిధ పూజా సామాగ్రినితోపాటు స్వామికి ఇష్టమైన ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించి పూజలు చేశారు. మరుసటి రోజు గురువారం నివాసంలో ఏర్పాటు చేసుకున్న వినాయక ప్రతిమను సమీపంలోని చెరువు నీటిలో నిమజ్జనం చేశారు.