జిల్లాల పునర్విజనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మంత్రుల ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో నరసాపురంను జిల్లా హెడ్ క్వార్టర్స్ గా ఏర్పాటు చేసేందుకు పునర్ ఆలోచించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ నాగరానికి మంగళవారం సాయంకాలం ఐదు గంటలకు నరసాపురం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ కుటమి నాయకులతో కలిసి వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ నరసాపురం వాణిజ్య, విద్య, వ్యాపార సంస్థలు రాజకీయ పక్షాలు కోరిక మేరక నరసాపురం ను జిల్లా హెడ్ కోటర్స్ గా ఏర్పాటు చేసేందుకు సీఎం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక పంపాలని కలెక్టర్ ను కోరారు.