బొమ్మనహాల్ మీ సింగేపల్లి గ్రామంలో సివిల్ రైట్స్ డే ను రెవెన్యూ, పోలీసు అధికారులు సంయుక్తంగా నిర్వహించారు. శనివారం సాయంత్రం బొమ్మనహాల్ తహసీల్దార్ మునివేలు, ఎస్ఐ నభిరసూల్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, బాల్యవివాహాలు, మహిళలు, ఫోక్సో చట్టాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని వివరించారు. కార్యక్రమంలో విఆర్ఓ సుజాత, సచివాలయ సిబ్బంది, డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.