నల్లగొండ జిల్లా: నల్లగొండ నకిరేకల్ పట్టణ కేంద్రంలో పలు వినాయక మండపాలను జిల్లా ఎస్పీ షరతు చంద్ర పవర్ సోమవారం సందర్శించారు. నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణం లో జరగాలని ఎస్పీ సూచించారు. మండప నిర్వహకులు పోలీసుల సూచనలను సలహాలను పాటించాలని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలను తీసుకుంటున్నట్లు తెలిపారు .ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రజల సౌకర్యం చూడాలని ఆదేశించారు చట్టానికి విద్యార్థులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.