మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం ఐటి కారిడార్ పిఎస్ పరిధిలోని అన్నోజిగూడలో శనివారం జరిగిన సంఘటనలో నిర్లక్ష్యంగా బైకు నడిపి ఓ వ్యక్తి మృతి కారణమైన 16 ఏళ్ల బాలుడుతో పాటు అతని తల్లి కేసు నమోదు అయింది. అన్నోజిగూడ కు చెందిన ఎలక్ట్రిషన్ చంద్రారెడ్డి (57), తన విధులకు స్కూటీపై వెళ్తుండగా అతివేగంగా వచ్చిన మైనర్ బాలుడు బైకుతో ఢీకొట్టడంతో చంద్ర రెడ్డి తీవ్ర గాయాల పాలై పూర్తి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును చేపట్టారు.