సీజన్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కుల్కచర్ల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు కిరణ్ కుమార్ గౌడ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంటి పరిసరాలలో నీటి నిల్వలు ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తద్వారా దోమల వ్యాప్తి చెందకుండా ఉండి మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ జ్వరాలు రాకుండా ఉంటాయన్నారు. వేడి చేసి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని పేర్కొన్నారు.