Parvathipuram, Parvathipuram Manyam | Aug 27, 2025
పార్వతీపురం జిల్లా సీతానగరం మండలంలోని మరిపి వలస నర్సిపురం గ్రామాల మధ్య బుధవారం పార్వతీపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. రాజమండ్రి నుండి పార్వతీపురం వస్తున్న ఆర్టీసీ బస్సు మరిపి వలస వద్ద ఎదురుగా వస్తున్న లారీని తప్పించిపోయి అదుపుతప్పి రోడ్డు ప్రక్కనున్న చెట్టును ఢీ కొట్టింది. ఈ సంఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.