టెక్కలి మండలం ముఖలింగాపురం గ్రామంలో టెక్కలి ఎస్సై-2 రఘునాథరావు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్థులతో సమావేశం నిర్వహించి సైబర్ సెక్యూరిటీ, ఆన్లైన్ మోసాలు, డ్రంక్ అండ్ డ్రైవ్, మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. అపరిచిత సందేశాలకు స్పందించవద్దని సూచించారు. గ్రామస్థులు వివాదాలకు దూరంగా కలిసిమెలిసి జీవించాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు,టెక్కలి పోలీసులు పాల్గొన్నారు.