బ్రహ్మకుమారిస్ ( ఓం శాంతి) బి కే విజయ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు సేవా కార్యక్రమాలు అభినందనీయమని జిల్లా జాయింట్ కలెక్టర్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ ఎం జె అభిషేక్ గౌడ్ అన్నారు. శనివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో స్థానిక టీటీడీ కల్యాణ మండపం వద్ద బ్రహ్మకుమారిస్ (ఓంశాంతి ) నిర్వహించిన రక్తదాన శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బ్రహ్మకుమారిస్ చేస్తున్న సేవలను కొనియాడారు. రక్తదానం చేయడం ఎంతో అభినందనీయమని రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రక్తదాన శిబిరాలు విరివిగా నిర్వహిస్తున్నారని ఈ రక్తపు నిలువలు అనేకమంది రోగులకు ఉపయోగపడుతుందని అన్నారు.