మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు పలాస లో అక్రిడేషన్ల జాప్యం,ఇళ్ల స్థలాల మంజూరు వంటి సమస్యలను పరిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీయూడబ్ల్యూజే డిమాండ్స్ డే కి పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీయూడబ్ల్యూజే సంఘ నేతలు,సభ్యులు తహసీల్దార్లకు,ఆర్డీవోలకు,కలెక్టర్లకు తమ డిమాండ్లతో వినతిపత్రం అందజేసే కార్యక్రమం చేపట్టారు.కార్యక్రమంలో భాగంగా పలాస మున్సిపాలిటీలో ఐజేయు జాతీయ కౌన్సిల్ మెంబర్ దనేశ్వర మహారణ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీవో కి వినతిపత్రం అందజేశారు.కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కొంచాడ.రవిశంకర్,పలాస జర్నలిస్టు అసోసియేషన్ పాల్గున్నారు.