సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లి లాకు వద్ద ఉపాధి హామీ కార్మికులు సోమవారం నిరసన తెలియజేసారు. తమ న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మేట్స్ కి గౌరవ వేతనం ఇవ్వాలని, ఉపాధి పనులు ప్రారంభించాలని, ఉపాధి వేతనం రూ 500 కు పెంచాలని, 100 రోజుల పనిదినాలు కల్పించాలని, వేతనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు మద్దతుగా మానవ హక్కుల సంఘాలు, బీఎస్పీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.