నంద్యాల జిల్లా వెలుగోడు పట్టణంలో హిందూ సంఘాలు శనివారం ఉదయం నుండి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం రాత్రి గణేష్ శోభాయాత్రలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చేసుకోవడంతో మండప నిర్వాహకులు విగ్రహాలను రోడ్లపై వదిలేసిన వెళ్లారు. అయితే అర్ధరాత్రి పోలీసులు విగ్రహాలను తీసుకువెళ్లి బోయ రేవుల సమీపంలో నిమజ్జన కార్యక్రమాన్ని ముగించారు. దీనిపై మందిపడ్డ విశ్వహిందూ పరిషత్ సభ్యులు, స్థానిక హిందూ సంఘాల నాయకులు వెలుగోడు లో భారీ ర్యాలీ నిర్వహించి స్టేషన్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తమ విగ్రహాలను మీరు ఎలా నిమజ్జనం చేస్తారంటూ పోలీసులను ప్రశ్నిస్తున్నారు,