బాపట్ల జిల్లా బల్లికురవ మండలం రామాంజనేయ పురం లో ఈనెల ఐదున చోటుచేసుకున్న దొంగతనం కేసులో 32 గ్రాముల బంగారం 30 తులాల వెండి రెండు బైకులను బల్లికురవలోని గొర్రెపాడు వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కృష్ణాజిల్లా గన్నవరంలో నివాసముంటున్న నిందితుడు రవికుమార్ను అదుపులోకి తీసుకున్నామని సంతమాగులూరు సిఐ వెంకట్రావు శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో పేర్కొన్నారు. వీటి విలువ సుమారు 7 లక్షల ఉంటుందన్నారు. నిందితుడి నుంచి సోత్తును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.