మద్నూర్ లో పులి సంచారం, భయాందోళనలు స్థానికులు మద్నూర్ మండలం వాడే-ఫతేపూర్ గ్రామాల శివారులో శనివారం ఉదయం పులి సంచారం కలకలం రేపింది. మద్నూర్ కు చెందిన పరమేశ్ అనే రైతు ఉదయం పశువుల కోసం గడ్డి కోయడానికి వెళ్లగా అతనికి పులి కనిపించడంతో ఇంటికి పరుగు తీసినట్లు గ్రామస్థులు తెలిపారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు పులి కనిపించిన ప్రాంతానికి రైతును తీసుకొని వెళ్లారు. పులి కాలి ముద్రల కోసం అన్వేషిస్తున్నారు.