సృష్టిలోని ప్రతి జీవికి ఒక పరిధి ఉంటుందని, కానీ మానవ జన్మకు పరిధి లేదని మైసూరు దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీపాద అనఘాదత్త క్షేత్రంలో దత్త విజయానంద స్వామీజీ చాతుర్మాస వ్రత దీక్ష మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు స్వామీజీ ప్రత్యేక పూజలు చేశారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కూడా ఈ క్షేత్రాన్ని సందర్శించారు.