శ్రీ సత్యసాయి జిల్లా అమడగూరు మండలం మారుతి పురం వద్ద గురువారం మధ్యాహ్నం వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. పుట్టపర్తి డీఎస్పీ విజయ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి హత్యా, ఏదైనా ప్రమాదమా? అనే కోణంలో క్లూస్ టీమ్ విచారణ చేపట్టారు. మృతుడు ముత్తప్పకు 40 ఏళ్లు ఉంటాయని, ఈ ఘటనపై త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీఎస్సీ తెలిపారు.