అనంతపురం జిల్లాలోని నార్పల మండలం వెంకటం పల్లి గ్రామంలో జమీల అనే మహిళపై అదే గ్రామానికి చెందిన లక్ష్మీరెడ్డి కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటనకు సంబంధించి అనంతపురం రూరల్ డిఎస్పి వెంకటేశ్వర్లు శనివారం రాత్రి విచారించారు. ఈ సందర్భంగా ఆయన సదరు మహిళతో వారి కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా మాట్లాడారు. జరిగిన విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆమెకు మెరుగైన వైద్య సేవలను అందించాలని ఆదేశించారు.