నిర్మల్ పట్టణంలో ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షానికి పట్టణంలో వర్షం నీరు నిలిచిపోయింది. పట్టణంలోని జిఎన్ఆర్ కాలనీలో జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ పరిశీలించారు. కాలనీలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. భారీ వర్షాల పట్ల పట్టణ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని సూచించారు. మున్సిపల్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు సహాయ చర్యలు చేపట్టాలని సూచించారు.