కళ్యాణదుర్గం పట్టణ సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనంతపురం నుంచి కర్ణాటకకు చేపలు లోడుతో వెళుతున్న బొలెరో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదంలో బొలెరో వాహన డ్రైవర్ కు స్వల్పంగా గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.