సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ గురుకుల పాఠశాలను కలెక్టర్ ప్రావీణ్య సందర్శించారు. ఇటీవల పాఠశాలలో కూలిన డార్మెంటరీ భవనం శిథిలాల తొలగింపు ప్రక్రియను శుక్రవారం అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా శిథిలాల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. గురుకుల పాఠశాల నూతన హాస్టల్ భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. విద్యార్థుల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తూ, విద్యార్థుల తాత్కాలిక వసతికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.