అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పోలీసులు భారీగా మోహరించారు. శనివారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు నగరంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన ఇరు వర్గాల వారు ఘర్షణ పడుతున్న విషయాన్ని తెలుసుకున్న వన్ టౌన్ సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ శ్రీనివాసులు భారీ ఎత్తున వారి సిబ్బందితో కలిసి ఆసుపత్రి ప్రాంగణంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు.