విజయనగరం జిల్లా రామభద్రపురం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మోటార్ బైక్ పై ప్రయాణిస్తున్న రాంబద్రపురం గ్రామానికి చెందిన మామిడిపాక వెంకటరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. బొబ్బిలి నుంచి మోటార్ బైక్ పై రామభద్రపురం వైపు వస్తున్న మామిడిపాక వెంకట రాజును అదే రూట్ లో ఎదురుగా మోటార్ బైక్ పై వస్తున్న మరొక వ్యక్తి బలంగా ఢీకొట్టడంతో కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు క్షతగాత్రుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.