ఏలూరు జిల్లా దెందులూరు రైల్వే స్టేషన్ సమీపంలోని సీతంపేట వద్ద రైలు ప్రమాదంలో ఆదివారం సాయంత్రం సుమారు 5గంటలకు గుర్తుతెలియనివ్యక్తి మృతి చెందాడు. ప్రమాదంలో శరీరం మొత్తం ముక్కలు కావడంతో అతన్ని గుర్తించలేని పరిస్థితి నెలకొంది.. అతను ధరించిన ఎర్రచొక్కా మాత్రమే గుర్తుగా ఉంది. అతని సెల్ఫోన్ కూడా ప్రమాదంలో ముక్కలైపోయింది. వివరాలు తెలిసినవారు ఏలూరు రైల్వే పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఘటనకు సంబధించి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసీ దర్యాప్తు చేపట్టారు