రక్తదానం ప్రాణదానంతో సమానమని,అత్యవసర పరిస్థితుల్లో దాతలు ఇచ్చే రక్తం ప్రాణాలను నిలబెడుతుందని ASF జిల్లా జడ్జి రమేష్, జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బ్రహ్మ కుమారి సోషల్ వింగ్ ఆధ్వర్యంలో శుక్రవారం ASF జిల్లా ఆసుపత్రిలో కలెక్టర్ రిబ్బన్ కట్చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు..అన్ని దానాల్లో కన్నా రక్తదానం చాలా గొప్పదని,ఒకరి ప్రాణాలు కాపాడటం ఎంతో సంతోషాన్నిస్తుందన్నారు. 40 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు.