కవితా వ్యవహారంపైఎమ్మెల్యే కడియం శ్రీహరి హాట్ కామెంట్స్ చేశారు.కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న గొడవలు ఆస్తి సంబంధించినవని,పది సంవత్సరాలు అధికారంలో ఉన్న కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ వనరులను దోచుకుందని ఆరోపించారు.ధరణిని అడ్డుపెట్టుకొని వేల ఎకరాల భూములు కబ్జా చేశారని అన్నారు.కాలేశ్వరాని అడ్డుపెట్టుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని,వేల ఎకరాల భూములు,వేలకోట్ల రూపాయలు పంచుకునే క్రమంలో వాళ్ల కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయన్నారు.వాళ్ళ కుటుంబంలో గొడవలు తెలంగాణ ప్రజలకు సంబంధం లేదని,కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా సంబంధం లేదు...ప్రజలు గమనించాలని అన్నారు.