జిల్లాలో వినాయక నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చూడాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ అధికారులను ఆదేశించారు.మంగళవారం ఉదయం 11-30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు గణేష్ నిమజ్జన ప్రాంతాలైన జగిత్యాలలోని చింతకుంట చెరువు, కోరుట్లలోని అంబేద్కర్ కాలనీ దగ్గర పెద్ద వాగు, మెట్ పల్లిలోని వట్టి వాగును పరిశీలించారు. గణేష్ నిమజ్జన ప్రాంతాల్లో చేస్తున్న ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమర్థవంతంగా నిర్వహించుటకు అధికారులకు పలు సూచనలు చేశారు. నిమజ్జనా