వర్షాకాలంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు తీసుకోవాల్సిన మెలకువలు రోగాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శనివారం ఉదయం పుట్టపర్తిలో విద్యార్థులకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ చేతన్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఇలా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మున్సిపల్ అధికారులతో కలిసి కలెక్టర్ చేతన్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం చిత్రావతి కూడలిలో మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటామని అధికారులు విద్యార్థులు పుర ప్రజల చేత కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు.