అనంతపురం నగరంలోని 5వ రోడ్డులో భార్యాభర్త అత్తపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచిన సంఘటన గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. దీంతో గాయపడిన వారిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తము తరలించారు. పెద్దమనుషుల పంచాయతీ సమయంలో ఒక్కసారిగా మరో వర్గంపై దాడికి పాల్పడినట్లుగా బాధితులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.