హొళగుంద మండల పరిధిలోని సుళువాయి- సమ్మతగేరి గ్రామాల మధ్య తుంగభద్ర దిగువకాల్వలో బుధవారం గుర్తుతెలియని పురుషుడి మృత దేహం కొట్టుకొచ్చినట్లు స్థానికులు తెలిపారు. సుమారు (30) సంవత్సరాల వయసు ఉంటుందని, మృతదేహంపై చొక్కా, ప్యాంటు ఉంది. ఈ విషయంపై పోలీసులకు ఎలాంటి సమాచారం అందలేదని బుధవారం పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.