శ్రీకాకుళం జిల్లా పలాస నియోజక వర్గ పరిధిలో మంగళవారం కురిసిన భారీ వర్షాలకు గిరిజనుల ఇల్లు నేలకులాయి. మందస మండలం తెంతులిగాం గ్రామానికి చెందిన సవర భారతి ఇల్లు మట్టి గోడలు తడిసి పూర్తిగా నేలమట్టమైంది. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి పెంటిభద్ర గ్రామంలో సవర రామస్య ఇంటి గోడ ఎవరూ లేని సమయంలో కూలడంతో పెను ప్రమాదం తప్పిందని బాధితులు తెలిపారు. ఉండేందుకు గూడును కోల్పోయామని ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.