మాచర్లలో కేంద్రీయ విద్యాలయ ఉన్నతాధికారుల బృందం శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపింది. తాత్కాలిక తరగతుల నిర్వహణ కోసం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలోని గదులు, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలను వారు పరిశీలించారు. అలాగే, భవన నిర్మాణానికి అవసరమైన స్థలం కోసం ఎస్.కె.బి.ఆర్. డిగ్రీ కళాశాల వద్ద ఉన్న స్థలాన్ని కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ఏ. ఇజ్రాయెల్ పాల్గొన్నారు.