కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి శనివారం బాధితులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించారు. సి.బెలగల్ మండలంలోని కొత్తకోట గ్రామానికి చెందిన బజారి అనే వ్యక్తికి రూ. 65,278 చెక్కు, అలాగే గూడూరు మండలంలోని బూడిదపాడు గ్రామానికి చెందిన నాగేశ్ అనే వ్యక్తికి రూ 36,795 చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు సీఎం చంద్రబాబు నాయుడు, కేడిసిసి బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి లకు కృతజ్ఞతలు తెలిపారు.